Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ అసలు విషయం!: టీవీ9-మహాన్యూస్‌పై పవన్ కళ్యాణ్ షాకింగ్ విషయాలు

Recommended Video

    మీడియా పై మరిన్నీ ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్

    హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం మరిన్ని ట్వీట్లు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ వరుస పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు దీక్షపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్నాళ్లు హోదా అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వరుస పోస్టులతో కలకం రేపుతున్నారు. ఉదయం వరుస ట్వీట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం మీడియా హౌస్‌లను టార్గెట్ చేశారు. వారి పిక్స్ పెట్టి మరీ నిలదీశారు. సోషల్ మీడియాలో పవన్ సంచలన విషయాలు బయట పెడుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

     మహా న్యూస్ పవన్ కళ్యాణ్

    మహా న్యూస్ పవన్ కళ్యాణ్

    మహా న్యూస్ టీవీ ఛానల్‌కు ఎంపీ సుజనా చౌదరి లేక ఆయన బినామీ నుంచి నిధులు వస్తున్నాయని, తన తల్లిపై అభ్యంతరకర డిబేట్లు నిర్వహించినందుకు వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని, మహా టీవీ సీఈవో అండ్ ఎడిటర్ మూర్తి కూడా అంటూ ట్వీట్ చేశారు.

     టీవీ 9పై పవన్ కళ్యాణ్

    టీవీ 9పై పవన్ కళ్యాణ్

    టీవీ 9లో శ్రీని రాజు 88.69 శాతం కలిగి ఉన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీవీ 9లో ఎవరి వాటా ఎంత అనే ట్వీట్ కూడా పెట్టారు. ఇందులో రవి ప్రకాశ్ వెలిచేటీ 20,00,000, చింతలపాటి హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ 1,61,21,100, ఐల్యాబ్స్ వెంచర్ కాపిటల్ ఫండ్ 40,00,000, కృష్ణప్రసాద్ 5,000, ఎంకేవీఎన్ మూర్తి 2,80,000, క్లిఫ్పర్డ్ పెరారియా 2,80,000... అంటూ షేర్ హోల్డర్ పేరు.. వారికి ఉన్న షేర్లను వెలుగులోకి తెచ్చారు.

     శ్రీనిరాజు బంధువులు వీరే

    శ్రీనిరాజు బంధువులు వీరే

    ఈ మేరకు కొందరి ఫోటోలు కూడా పెట్టారు. అనుచిత ప్రచారం ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. శ్రీని రాజు.. సత్యం రామలింగ రాజు గారికి దగ్గరి బంధువు అని పేర్కొన్నారు. అంతేకాదు, శ్రీని రాజా.. రామ్ గోపాల్ వర్మకు కూడా బంధువులే అని పేర్కొన్నారు.

    పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు

    పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు

    అంతకుముందు, పవన్ కళ్యాణ్ ట్వీట్లో.. తన తల్లిని విమర్శించేందుకు ముగ్గురు సహకరించారని పేర్కొన్నారు. అంతేకాదు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పిక్ పెట్టి.. దేశం టీంకు చెందిన మరో సభ్యులు 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కూడా టీఆర్పీ కోసం ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+