వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ప్రమాణానికి పవన్: జూఎన్టీఆర్ వస్తారా, ఒత్తిడిలో?

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు/విజయవాడ: ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని, దీనికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వస్తారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు బుధవారం అన్నారు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రమాణ స్వీకార కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్‌తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరు హాజరవుతారని చెప్పారు. గుంటూరు - విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ఉంటుందని చెప్పారు.

Pawan Kalyan to attend Chandrababu swearing in

జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరు వస్తారని గరికపాటి రామ్మోహన్ రావు చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున జూనియర్ ప్రచారం చేస్తారని చివరి వరకు భావించారు. కానీ ఆయన రాలేదు.

అలాగే టిడిపి గెలిచిన తర్వాత రెండు రోజులకు జూనియర్ ఎన్టీఆర్ టిడిపి అధినేతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రచారానికి ముఖం చాటేసిన జూనియర్ ఎన్టీఆర్ టిడిపి గెలిచిన తర్వాత కూడా ఆలస్యంగా చంద్రబాబును కలిశారనే అసంతృప్తి తెలుగు తమ్ముళ్లో కనిపించింది.

అంతేకాకుండా ఎపిలో టిడిపి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పవన్ ప్రచారం టిడిపికి కలిసి వచ్చిందనే వాదన కారణంగా అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడికి లోనయ్యారనే ప్రచారం సాగింది. అలాంటిది ఇప్పుడు పవన్ ప్రమాణ స్వీకారానికి హాజవుతున్నారు. అలాంటప్పుడు జూనియర్ వస్తారా అనే చర్చ సాగుతుంది. ఆయన రాకుంటే మరోసారి తప్పులో కాలేసినట్లే అవుతుందనే వారు లేకపోలేదు.

English summary
Jana Sena party chief Pawan Kalyan to attend Chandrababu swearing in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X