బర్త్‌డే రోజు పవన్ కల్యాణ్‌కు మనం ఇచ్చే గిఫ్ట్ ఇదే..!!
Pawan Kalyan Birthday: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఇంకో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్‌డే వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడానికి అటు పార్టీ క్యాడర్, ఇటు అభిమానులు సన్నద్ధమౌతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసుకుంటోన్నారు.
స్పెషల్ అదే..
ఈ జన్మదిన వేడుకలు పవన్ కల్యాణ్‌కు అత్యంత స్పెషల్‌గా నిలిచిపోనున్నాయి. జీవితాంతం గుర్తుండిపోనున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అధినేతగా, అంతకుమించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ జరుపుకోనున్న తొలి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇవే కావడమే దీనికి కారణం.

రాజకీయంగా..
మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో ఆయన విజయఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగా గీతను 70,000లకు పైగా మెజారిటీతో ఓడించారు.
100 శాతం..
ఆయన సారథ్యంలో జనసేన పార్టీ మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. అన్నింట్లోనూ తిరుగులేని మెజారిటీతో గెలిచింది. నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది. ఈ జోష్‌తో తన తొలి పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
క్లీన్ ఆంధ్రా..
ఈ సందర్భంగా జనసేన పార్టీ కీలక పిలుపునిచ్చింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా మొక్కలను నాటాలని క్యాడర్‌కు సూచించింది. ప్రతి ఒక్కరు కూడా క్లీన్ ఆంధ్రా, గ్రీన్ ఆంధ్రా ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. అదే- జనసేనాధీశుడికి తాము ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్‌గా అభివర్ణించింది.
పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం, భావితరాలకు స్వచ్ఛమైన పకృతిని అందిద్దాం. #CleanAndhraGreenAndhra pic.twitter.com/OHxAc8vvUE
— JanaSena Party (@JanaSenaParty) August 27, 2024
పవన్‌కు ఇచ్చే గిఫ్ట్..
ఒక మొక్క రెండు తరాలకు సరిపడే ఆక్సిజన్, పండ్లు, ఔషధ ఫలాలను అందిస్తుందని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తోందని జనసేన పేర్కొంది. పవన్ కల్యాణ్‌కు తాము ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి అదేనని, భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దామని కోరింది.
తరాలకు సరిపడేలా..
సగటు మనిషి జీవిత కాలం- 67 సంవత్సరాలు కాగా.. ఉసిరి చెట్టు- 70, నేరేడు చెట్టు- 100, చింత చెట్టు- 100, వేప చెట్టు- 200, రావి చెట్టు- 2,500 సంవత్సరాల పాటు జీవించగలుగుతాయని వివరించింది. అందుకే పవన్ బర్త్‌డే నాడు విస్తారంగా మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications