పవన్ వారాహి యాత్రకు బ్రేక్ - "మెగా" వేడుక, కీలక నిర్ణయాలు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ఉమ్మడి క్రిష్టా జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన తరువాత ఈ జిల్లాలో సాగుతున్న యాత్ర పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన యాత్రకు మూడు వారాలు బ్రేక్ ఇవ్వనున్నారు. రాజకీయ కారణాలతో పాటుగా వరుణ్ తేజ్ వివాహం కోసం పవన్ ఇటలీకి వెళ్లనున్నారు.
మూడు వారాల విరామం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు మూడు వారాల విరామం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటుగా విదేశీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అటు టీడీపీతో పొత్తు వేళ పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణపై పవన్ కీలక సమావేశాలు ఏర్పాటు చేసారు.

టీడీపీతో సమన్వయం...సీట్ల ఖరారు..అభ్యర్దుల ఎంపిక..పార్టీ పరంగా ఇస్తున్న హామీలు..ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాల పైన పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు. దీని కోసం ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అదే సమయంలో సుప్రీం నుంచి ఏసీబీ కోర్టు వరకు చంద్రబాబు కేసులకు సంబంధించి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.
వరుస పార్టీ సమావేశాలు: చంద్రబాబు బెయిల్ మీద బయటకు వస్తే ఆయన్ను కలవాలని పవన్ భావిస్తున్నారు. పార్టీ సమావేశాల కొనసాగింపులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమావేశాలకు సమయం కేటాయించారు. తెలంగాణ నేతలతోనూ సమావేశం కానున్నారు. తెలంగాణలో అభ్యర్దుల ఖరారుతో పాటుగా ప్రచారం పైనా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. తెలంగాణలో పొత్తుల పైన ఇంకా స్పష్టత రాలేదు. చంద్రబాబు బయటకు వస్తే అన్ని అంశాలు చర్చించి..నిర్ణయాలు ప్రకటించటం..పార్టీ నేతలకు కార్యాచరణ చేసేలా సమావేశాలకు షెడ్యూల్ చేసారు. దీంతో, వచ్చే వారం మొత్తం పార్టీ వ్యవహారాలకే పవన్ సమయం కేటాయించనున్నారు.

వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీకి: ఇక, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివహం కోసం కుటుంబ సభ్యులతో కలిసి పవన్ ఈ నెల 17వ తేదీ తరువాత ఇటలీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న తరువాత ఇటలీ నుంచి ఈ నెల 26న పవన్ తిరిగి ఏపీకి రానున్నారు. దీంతో, 27వ తేదీ తరువాత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ఇక నుంచి టీడీపీ, జనసేన ఎటువంటి కార్యక్రమాలు చేసినా పరస్పరం పార్టీ శ్రేణులు కలిసి పాల్గొనేలా నిర్ణయం ప్రకటించనున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ టీడీపీతో పొత్తు ప్రకటన పైన వస్తున్న ఆరోపణల వేళ..నేరుగా బీజేపీ ముఖ్య నేతలతో మాట్లాడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ వారం పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications