పోలింగ్ వేళ వైసీపీ చేతికి పవన్ అస్త్రం...!!
ఏపీలో పోలింగ్ భారీ స్థాయిలో నమోదవుతోంది. ఇప్పటికే 55 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతంలో ఓటర్లు రావటం కొంత తగ్గినా..గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో నిబందనలు ఉల్లంఘించారనే ఆరోపణలుమొదలయ్యాయి.
జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తన ఓటు మంగళగిరిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రోజు మంగళగిరిలో ఓటు వేసేందకు పవన్ తన సతీమణితో సహా వచ్చారు. పోలింగ్ కేంద్రానికి పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పవన్ సీఎం పవన్ సీఎం పవన్ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. అయితే, పవన్ సతీమణికి అక్కడ ఓటు లేదని సమాచారం. ఓటు లేకపోయినా తనతో పాటుగా పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.

ఓటు లేకున్నా పోలింగ్ కేంద్రంలోకి పవన్ భార్య..!!#PawanKalyan #AnnaLezhneva #AndhraPradeshElection2024 #AndhraPradeshElections2024 #ApElections2024 #AndhraPradeshAssemblyElections2024 #VoterTurnout #Oneindiatelugu pic.twitter.com/DgOyZRZ3Ic
— oneindiatelugu (@oneindiatelugu) May 13, 2024
ఓటు లేని వారికి పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రం లోపలకు అనుమతించరు. కానీ, పవన్ తన సతీమణితో సహా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. కొందరు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇదే అంశాన్ని ఇప్పుడు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పవన్ ను టార్గెట్ చేసారు. ఓటు లేని వారిని పోలింగ్ కేంద్రంలోకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారులు అభ్యంతరం చెప్పకపోవటం పైన విమర్శలు మొదలయ్యాయి. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో హోరా హోరీగా మారిన ఎన్నికల సమరంలో పోలింగ్ భారీగా సాగుతోంది. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications