కర్ణాటక ఎన్నికల్లో పవన్ ప్రచారం: ఎవరి తరపున అంటే..?
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ తరపున పవన్ ప్రచారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల తరపున ప్రచారం అవకాశాలు లేవు. పవన్‌తో కర్ణాటకలోని జేడీఎస్ ( జనతా దళ్ సెక్యులర్) పార్టీ ఇటీవల సంప్రదింపులు జరిపినట్టు, ఆయనతో ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించారు.

పవన్ ప్రచారంపై ఆసక్తి
కాగా, బీజేపీ, కాంగ్రెస్ తో సహా జేడీఎస్ తరపున కూడా పవన్ ప్రచారం చేయరని తెలుస్తోంది. మరి ఎవరి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే విషయం ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపువతోంది.
Recommended Video


సన్నిహితుల కోసమే పవన్
చిక్ బళాపురం, బళ్లారి ప్రాంతాల్లో పవన్ సన్నిహితులు ఉన్నారని, స్వతంత్ర అభ్యర్థులుగా వారు బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో తన సన్నిహితుల తరపున పవన్ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే చెప్పిన పవన్
ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చిక్‌బళాపురానికి వెళ్లారు. అక్కడ తన సన్నిహితుడిని అభిమానులకు పరిచయం చేసి.. ‘వచ్చే ఎన్నికల్లో అతడు ఎన్నికల్లో పోటీ చేస్తాడు, గెలిపించండి' అని పవన్ పిలుపునిచ్చారు.

అక్కడ తెలుగువారే అధికం
రాయలసీమ ప్రాంతంలో సరిహద్దును పంచుకునే చిక్ బళాపురం, బళ్లారి ప్రాంతాల్లో తెలుగు వాళ్లు పెద్ద ఎత్తున ఉంటారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఆ ప్రాంతాల్లో ప్రచారం చేయనుట్లు తెలుస్తోంది. పవన్ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తారని వస్తున్న వార్తలతో ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పవన్ ప్రచారం చేస్తే అక్కడ ఆయన ప్రభావం ఎలా ఉండనుందోనని చర్చలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications