Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ హెచ్చరిక: చంద్రబాబుకు 'చిరు' భయం, జగన్ సేఫ్?

హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి - టిడిపిలకు అండగా నిలబడిన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల నాటికి ఆ కూటమికి ఝలక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్... టిడిపి-బిజెపి కూటమికి జోరుగా ప్రచారం చేశారు. తాము ఏపీలో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణమని టిడిపి, బిజెపి నేతలు చెబుతుంటారు. అలాంటి పవన్ వచ్చే ఎన్నికల్లో బిజెపికి కాకపోయినా చంద్రబాబుకు మాత్రం చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకి అనే వాదనలు ఉన్నాయి. టిడిపి - బిజెపి కూటమికి ఆయన మద్దతివ్వడానికి అదీ ఓ కారణమనే చెప్పవచ్చు. తాను మద్దతిచ్చిన పార్టీలు ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆయన సమయం వచ్చినప్పుడు నిలదీస్తున్నారు.

Pawan Kalyan caution to Chandrababu for 2019 elections

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూముల విషయంలో పవన్ గట్టిగా నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రానికి చురకలు అంటుంచారు. కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అదే సమయంలో... చంద్రబాబుతో మాట్లాడాక కొంచెం తగ్గారనే వాదనలు రావడం వేరే విషయం. తాజాగా, చిరంజీవికి అవసరం అయినప్పుడు నేను ముందుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అయితే, తన అన్నయ్య చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్.. చంద్రబాబును, అవసరమైతే టిడిపిని కూడా పక్కన పెట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. చిరంజీవి అంగీకరించి, బిజెపిలోకి వస్తే, ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన జనసేన అధినేతకు అభ్యంతరం ఉండదు.

కానీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోతానని చెప్పారు. చిరంజీవికి ఉన్న పాపులారిటీ, పవన్ కళ్యాణ్ మద్దతు కోసం.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ చిరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

అదే నిజమైతే బిజెపి, టిడిపిలకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి తన అన్నయ్య అయితే మద్దతు విషయంలో పవన్ కళ్యాణ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజెపిలో చేరితే.. ఆ పార్టీ టిడిపికి దూరం అవుతుంది.

పవన్ కళ్యాణ్ తాజా అవసరమైన సమయంలో అన్నయ్యకు అండగా ఉంటాననే వ్యాఖ్యల వల్ల ఎలా చూసినా ఎక్కువగా నష్టపోయేది చంద్రబాబేననే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపికి ఏపీలో పెద్దగా సీట్లు లేవు. కాబట్టి అది నష్టపోతుందనే వ్యాఖ్యల్లో పెద్దగా అర్థం లేదు. ఇక జగన్ ఓట్ షేర్ అతనికి ఉంటుంది. దీంతో జగన్‌కు నష్టం లేదు.

పార్టీ ఏది అయినా, చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాపులు మద్దతిస్తారు. మెగా అభిమానులు కూడా వెన్నంటి ఉంటారు. చిరు, పవన్ ఇమేజ్ కలిసి వస్తుంది. ఇలా ఏవిధంగా చూసినా ఎక్కువ నష్టం చంద్రబాబుకే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+