కాన్వాయ్‌ లేకుండా ఒంటరిగా చంద్రబాబు ఇంటికి పవన్- కీలక చర్చలు..!!

స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. సుప్రీం ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం ఈ రోజు తమ నిర్ణయం వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. అటు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ నామినేషన్ల సమయంలోనూ ఘర్షణలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం.. పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఎలాంటి భద్రతా సిబ్బంది.. కాన్వాయ్ లేకుండా వచ్చిన పవన్ సీఎంతో భేటీ అవ్వటం.. ఆ తరువాత కొద్ది సేపటికే వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.

డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్ పోలింగ్.. కౌంటింగ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ఎన్నికల వాయిదా వేళ తాజా పరిణామాలు.. రెబల్ అభ్యర్ధుల వ్యవహారం పైన ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నెలకొన్న పరిస్థితులపైనా చర్చించినట్లు తెలిసింది. అయితే, ఎలాంటి భద్రతా సిబ్బంది, కాన్వాయ్‌ లేకుండా ఒంటరిగా వచ్చిన ఆయన ముఖ్యమంత్రితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
pawan-kalyan-chandrababu-hold-key-talks-amid-local-body-election-developments-here-the-details

తాజా పరిణామాల పై చర్చ

దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ సీట్ల పైన వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపైనా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ భేటీ పైన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా.. జెడ్పీటీసీ ఎన్నికల్లో స్థాని కంగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి కోర్టుకు వెళ్లేందుకు వైసీపీ సిద్దం అవుతోంది. ఇక, ఈ సాయంత్రం ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 19 మున్సిపాల్టీల పై నిర్ణయం.. కౌంటింగ్ తేదీల పైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+