సినిమాలు చేస్తూ జనసేన నిర్మాణంపై పవన్‌‍కళ్యాణ్ దృష్టి

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పార్టీ విస్తరణ పైన దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల పూర్తి అయిన అనంతరం ఆయన పార్టీ పైన మరింత దృష్టి సారించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్... బిజెపి, టిడిపి కూటమికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

తమ గెలుపులో పవన్ ప్రభావం ఉందని టిడిపి, బిజెపిలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయనకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా... పవన్ 2019ను లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన కసరత్తు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో పవన్ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan

ఇటీవలి వరకు ప్రచారం వంటి వాటి కారణంగా పవన్ సినిమాలకు విశ్రాంతి ఇచ్చారు. త్వరలో సినిమాల పైన పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అయితే అది ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాల పైనే. ఆ తర్వాత పవన్ తన పార్టీ జనసేనను విస్తరించే అంశంపై దృష్టి సారించనున్నారు. అలా అని పవన్ సినిమాలకు దూరమయ్యే అవకాశం లేదు. సినిమాలు తీస్తూనే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.

మరో రెండు మూడు సినిమాల్లో నటించేందుకు తాను అంగీకరించానని, వాటిని పూర్తి చేయటంతో పాటు పార్టీ విస్తరణపైనా దృష్టి సారిస్తానని పవన్ కళ్యాణ్ మంగళవారం చెప్పారు. కాగా, మంగళవారం ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ సాయంత్రం హైదరాబాదు బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+