రేపటితో నా ఆలోచనలు ముగిస్తాను: నేటికి పవన్ కళ్యాణ్ విరామం!
పలు అంశాలపై నాలుగు రోజులుగా బీజేపీ పైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదో రోజైన సోమవారం నాడు విరామం తీసుకున్నారు!
విజయవాడ: పలు అంశాలపై నాలుగు రోజులుగా బీజేపీ పైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదో రోజైన సోమవారం నాడు విరామం తీసుకున్నారు! నోట్ల రద్దు, బంగారం పైన పరిమితుల అంశం పై తాను రేపు (మంగళవారం) స్పందిస్తానని పవన్ ఈ రోజు ట్వీట్ చేశారు.
అలాగే, ఈ ఐదు సమస్యల పైన తన అలోచనలను రేపటితో ముగించనున్నట్లు తెలిపారు. తాను 5 అంశాల పైన స్పందిస్తానని, రోజుకో అంశంపై మాట్లాడుతానని పవన్ ఈ నెల 15వ తేదీన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

1. గోవధ, 2. రోహిత్ వేముల ఆత్మహత్య, 3. దేశభక్తి, 4. నోట్ల రద్దు, 5. ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై స్పందిస్తానని చెప్పారు.
ఇందులో భాగంగా ఆ ట్వీట్ పెట్టిన రోజునే.. గోవధ అంశంపై ట్వీట్ చేశారు. మరుసటి రోజు వేముల రోహిత్ అంశంపై మాట్లాడారు. శనివారం నాడు దేశభక్తి, ఆదివారం నాడు ప్రత్యేక హోదా పైన స్పందించారు. ఈ రోజు (సోమవారం) ఏ అంశంపై మాట్లాడలేదు. నోట్ల రద్దు పైన మంగళవారం మాట్లాడుతానని ఈ రోజు ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications