వన్నె తెస్తారు: వెంకయ్య నాయుడికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలుగు బిడ్డ అయిన వెంకయ్య నాయుడు సీనియర్‌ రాజకీయ నాయకుడిగా అపార అనుభవం కలిగి ఉన్నారని, ఉపరాష్ట్రపతి పదవికి వన్నెతెస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

ఇది తెలుగువారందరూ గర్వించదగ్గ పరిణామమని, తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేసినందుకు బీజేపీ అధినాయకత్వాన్ని అభినందించారు.

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డిఎ అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+