Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలియదా.. సంతోషం: అశోక్-పితానిలపై వవన్ కళ్యాణ్ వెటకారం!

తాను ఎవరో తెలియదన్న తెలుగుదేశం పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు.ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.

అమరావతి: తాను ఎవరో తెలియదన్న తెలుగుదేశం పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు.

టిడిపి నేతలపై జనసేనాని స్పందన

టిడిపి నేతలపై జనసేనాని స్పందన

ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటీవల కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. పవన్ ఎవరో తెలియదని చెప్పారు. తాజాగా, మంత్రి పితాని కూడా అలాగే మాట్లాడారు. దీనిపై జనసేన అధినేత ధీటుగా స్పందించారు.

సంతోషమన్న పవన్ కళ్యాణ్

'అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏమిటో తెలియదు.. సంతోషం' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Recommended Video

    Pawan Kalyan targeted By This Politician పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు వ్యూహం | Oneindia Telugu
    ధీటుగా కౌంటర్లు

    ధీటుగా కౌంటర్లు

    పవన్ కళ్యాణ్ పలు సమస్యలపై టిడిపి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. దానికి ఆ తర్వాత పవన్ కూడా స్పందించారు. నేను ఆయనకు తెలియకపోవచ్చు, కానీ అశోక్ మాత్రం తనకు తెలుసునని కౌంటర్ ఇచ్చారు.

    టిడిపి నేతలకు వెటకారంతో కౌంటర్లు

    టిడిపి నేతలకు వెటకారంతో కౌంటర్లు

    పవన్ కళ్యాణ్ ఓ విధంగా టిడిపి నేతలకు వెటకారంగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి వారు తెలియదు అన్నట్లు మాట్లాడితే జనసేనాని కూడా అంతే వెటకారంగా వారికి కౌంటర్లు ఇస్తున్నారు.

    అందలం ఎక్కిస్తే మర్చిపోయారు

    అందలం ఎక్కిస్తే మర్చిపోయారు

    2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి గెలవడానికి పవన్ కళ్యాణ్ మద్దతు కూడా కారణం. ఈ విషయాన్ని పలుమార్లు టిడిపి నేతలు కూడా చెప్పారు. కానీ సమస్యలపై స్పందించేసరికి ఆయన ఎవరో తెలియదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసరికి పవన్ ఏమిటో తెలియదని చెప్పడం విడ్డూరమంటున్నారు.

    పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన

    పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన

    పవన్ కళ్యాణ్ పైన అశోక్, పితానిలు అలా స్పందించేసరికి అభిమానులు కూడా ధీటుగా స్పందించారు. అసలు వారిద్దరు ఎవరని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అందర్నీ మర్చిపోయే ప్రజాప్రతినిధులు వీళ్లని, అందలం ఎక్కించిన పవన్‌ను, ప్రజలకిచ్చిన వాగ్ధానాలను కూడా మరిచారని ఎద్దేవా చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+