వెటకారం చేస్తారా: యనమలకు పవన్ కళ్యాణ్ కౌంటర్, రంగంలోకి దిగుతా!

హైదరాబాద్: జనసేన పార్టీ అద్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తే విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చెయ్యడం వారికే చెల్లిందని టిడిపి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Pawan Kalyan counters to Yanamala

సినిమా పరిశ్రమకు హైదరాబాదులో ఇచ్చినవి కొండలు, బహుళ పంటలు పండే పొలాలు కాదని, ఈ విషయం యనమల రామకృష్ణుడికి తెలియదనుకుంటానని చురక అంటించారు. పైగా హైదరాబాదు కొండల్లో కానీ విశాఖ కొండల్లో కాని తనకు అయితే స్టూడియోలు లేవని పేర్కొన్నారు.

మొదట కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా లేక రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించవచ్చునని ఎద్దేవా చేశారు. బహుళ పంటలు పండే పొలాలు స్టూడియోకు ఇవ్వలేదన్నారు.

నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+