పవన్ కళ్యాణ్ డిమాండ్, నిరీక్షణ: ప్రత్యేక హోదాపై బీజేపీ ప్లాన్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరగడం చర్చకు దారి తీసింది. ప్రత్యేక హోదా పైన ఎందుకు నిలదీయడం లేదని టీడీపీని ఆయన ప్రశ్నించారు. దానికి కౌంటర్‌గా మీరేం చేస్తున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను త్వరగా ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, నటుడు శివాజీ, తెలుగుదేశం పార్టీలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి పవన్ గతంలో పెద్దగా స్పందించలేదు.
రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఎంపీలను ఏకిపారేశారు. అదే సమయంలో బీజేపీ పైన పెద్దగా విమర్శలు గుప్పించలేదు. అయితే, ఇద్దరు ఎంపీలు ఉన్నారని, ఏం చేస్తున్నారని మాత్రం ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిమాండ్ నిజంగానే ప్రత్యేక హోదా కోసమా లేక టీడీపీని టార్గెట్ చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇదిలా ఉండగా, ఏపీ బీజేపీ నేతలు ప్రత్యేక హోదా పైన ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారు.
తమ పార్టీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీ బిజెపి నేతలు చెబుతున్నారు. ఎప్పుడనేది అప్పుడే చెప్పలేమని, కానీ హామీని మాత్రం తప్పకుండా నెరవేర్చుతామని గతంలోనే చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మౌనంగా ఉండేందుకు పలు కారణాలు ఉన్నాయని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ పార్టీలు డిమాండ్ చేస్తాయి. బీహార్ ఎప్పటి నుండి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఒక్కదానికే ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీహార్ ఎన్నికలు పూర్తికావాలని బిజెపి భావిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బిజెపి.. ప్రత్యేక హోదా పైన మౌనంగా ఉంది. బీహార్ ఎన్నికల అనంతరం కదలిక మొదలు కావొచ్చునని భావిస్తున్నారు.
అందువల్లే ఏపీ బిజెపి నేతలు మౌనంగా ఉన్నారని, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుండి వ్యతిరేకత వస్తే... హోదా పేరుతో కాకుండా మరో పేరుతో పెద్ద ఎత్తున ఏపీకి నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే.. -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications