ఇక మీ ఇష్టం!: చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేపదే తన సోదరుడు చిరంజీవిని, ఆయన 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఉదాహరణగా చెబుతున్నారు.

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేపదే తన సోదరుడు చిరంజీవిని, ఆయన 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఉదాహరణగా చెబుతున్నారు. విపక్షాలను టార్గెట్ చేసే సమయంలో ఆయన చిరంజీవి పేరును తీసుకు వస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీ నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, ఇతర నాయకులను విమర్శించినప్పుడు ఆయన 'అన్నయ్య'ను ఉదాహరణగా చెబుతున్నారు.

చిరంజీవిని లాగారు

చిరంజీవిని లాగారు

తాజాగా, శుక్రవారం నాడు కేంద్రమంత్రి సుజనా చౌదరి పైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆయన మళ్లీ చిరు పేరును తీసుకు వచ్చారు. ప్రజల కోసం తాను సొంత అన్నయ్య చిరంజీవిని వదిలేసి వచ్చానని చెప్పారు.

వ్యక్తిగత సంబంధాలంటూ..

వ్యక్తిగత సంబంధాలంటూ..

సుజనా చౌదరితో పాటు అందరితోను తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పవన్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పైన విమర్శలు గుప్పించారు. తన అన్నయ్యనే వదిలేశానని, ప్రజల కోసం మీకు మద్దతివ్వడం కూడా మానేస్తానని హెచ్చరించారు. వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి, ఆ తర్వాత హెచ్చరించారు.

ఇన్నాళ్లు కలిసి పని చేశామని, కోరుకున్నది జరగనప్పుడు ఇక మీ నుంచి దూరం జరిగేందుకు వెనుకాడనని చెప్పారు. తద్వారా ఫ్యామిలీనే పక్కన పెట్టానని టిడిపిని పక్కన పెట్టడం లెక్క కాదని చెప్పకనే చెప్పారు. ఉంటే ఉంటా, పోతే పోతా.. కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి సిద్ధమన్నారు.

ప్రజారాజ్యం పార్టీతో పాఠాలు

ప్రజారాజ్యం పార్టీతో పాఠాలు

కొద్ది రోజుల క్రితం పోలవరం డంప్ గ్రామ బాధితులు, అమరావతి రైతులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పేరును ప్రస్తావించారు. తాను దూకుడుగా ముందుకు వెళ్లనని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు.

భావోద్వేగం

భావోద్వేగం

జనసేనాని గతంలోను పలుమార్లు చిరంజీవి పేరును తీసుకు వచ్చారు. కొన్నిసార్లు భావోద్వేగానికి కూడా లోనయ్యారు. తనకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వాడు తన అన్నయ్య అని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినందుకు ఆయనను కూడా పక్కన పెట్టి, ఆయనను బాధ పెట్టానని అభిప్రాయపడ్డారు. తమ దారులు వేరైనా లక్ష్యం ఒక్కటేనని చెప్పిన సందర్భాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+