ఒకే ఫ్యామిలీ నుంచి రెండో వ్యక్తి పవన్: ఏ వైపు చూస్తున్నారు, ఎటువైపు దారి తీస్తుందో?

ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును హైదరాబాద్ నుంచి ఏలూరుకు మార్చుకోవాలని నిర్ణయించారు. ఏలూరులో ఓ ఇంటిని కూడా చూడమని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

తాను ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటానని చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తు రాజకీయాలపై ఆయన తాజా ప్రకటన ఎటువైపు దారితీస్తుందోనని ఆసక్తి అందరిలోను నెలకొంది. విభజన నేపథ్యంలో పలువురు నేతలు, ఇతరులు తమ ఓటు హక్కును ఏపీకి మార్చుకుంటున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ విషయం వేరు. ఆయన ఇప్పటి దాకా హైదరాబాదులో ఉన్నారు. ఓటు హక్కు కలిగి ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించాక ఆయన ఓటరుగానే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

pawan kalyan

ఇందులో భాగంగా ఆయన ఎక్కడ ఓటు హక్కును పొందుతారు? వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున పోటీ చేస్తారా? పోటీచేస్తే ఎక్కడ నుంచి చేస్తారు? అనే అంశాలపై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్‌ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పవన్ ఏలూరులో ఓటు హక్కు పొందుతాడని తెలియడంతో స్థానిక నాయకులు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులు ఇంటికి కూడా వెతికే పనిలో పడ్డారు.

పవన్‌ ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటానని చెప్పడం వెనుక సొంత జిల్లా అనే భావన ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ స్వగ్రామం పగో జిల్లాలోని మొగల్తూరు.

ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా ఆయన సోదరుడు పవన్‌ స్వగ్రామంలో కాకుండా జిల్లా కేంద్రం ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకోనున్నారు.

అదే జరిగితే ఆయన జిల్లాలో ఏలూరుతో పాటు జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసే అవకాశముంది. ఆయన ఏలూరు నుంచి పోటీ చేస్తారా? లేక ఇతర ప్రాంతాలకు తరలివెళతారా? చూడాలి.

ఇటీవల ఆయన జిల్లాలోని భీమవరం మండలం తుందర్రు ఆక్వాపార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్థులకు కూడా బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాతో ఇప్పటి నుంచే విడదీయలేని సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒకే కుటుంబం నుంచి రెండో వ్యక్తిగా పవన్‌ కళ్యాణ్ జిల్లాలో తన రాజకీయ పునాదిరాయి వేయడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చకు కారణమైంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉండి, ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+