ఫేస్‌బుక్‌లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ...జనసేన కోసం అధికారిక ఎఫ్ బి పేజ్ ప్రారంభం
Recommended Video

అమరావతి:పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్‌లోకి ఎంటర్ అయ్యారు. తన పేరుతోనే అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తన ఫేస్ బుక్ ఎంట్రీ గురించి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలను తెలిపేందుకే తాను ఈ ఫేస్‌బుక్ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2న తాను రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. విజయవాడ నుంచి తుని వరకు ఈ రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ రైలు యాత్రకి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణంలో రైలులోనే పలు వర్గాల ప్రజలతో పవన్‌కల్యాణ్ మాటామంతీ నిర్వహించనున్నారు. దీనితో పాటు తాను ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో సైతం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కు ఆయన మాతృమూర్తి అంంజనాదేవీ నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆమె ఈ మేరకు మంగళవారం చెక్కును పవన్ కళ్యాణ్ కు అందచేశారు. జన సేన పార్టీ ఆఫీస్ కు వచ్చి మరీ ఆమె పవన్ కు ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా చాలా భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ కు చెప్పానన్నారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఇతర జనసేన నేతల్ని పవన్ తన తల్లి అంజనీదేవికి పరిచయం చేశారు.












Click it and Unblock the Notifications