పవన్ కల్యాణ్ 'రహస్యాలను'లీక్ చేసిన రేణూదేశాయ్

పేదల సంక్షేమం కోసం పవన్ కల్యాణ్ కృషిచేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూదేశాయ్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ అత్యంత అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా తన మద్దతు ఎప్పుడూ ఆయనకే ఉంటుందని స్పష్టం చేశారు.

ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు పవన్ ను తాను రాజకీయంగా మద్దతిస్తూనే ఉన్నానని, తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని, ఆయన సమాజానికి మంచి చేయాలనుకుంటున్నారు అన్నారు. నాకు తెలిసినంతవరకు చాలా అరుదైన వ్యక్తి అని, డబ్బు మనిషి కాదని, మనీ మైండెడ్ కాదని, డబ్బుపై పవన్ కు ఆసక్తి లేదని, సమాజం, పేదల సంక్షేమం కోసం పనిచేయాలనుకుంటున్నారన్నారు.

pawan kalyan ex wife renu desai video

రాజకీయంగా ఎప్పుడూ ఆయన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటానన్నారు. పవన్ చేస్తున్న సేవను గుర్తించాలని, విజయవంతమైన నటుడని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని, ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దన్నారు. మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలన్నారు. తన పిల్లలే కాదని, మిగిలిన ఇద్దరు పిల్లలను కూడా ఇలాంటి వాటిల్లోకి లాగొద్దని సూచించారు.

ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారితీశాయని, దాన్ని గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. కాకపోతే పవన్ పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి సినిమా ఉంటుందన్నారు. ఒక తల్లిగా తన వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నానన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లలను ఇందులోకి లాగొద్దని, సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పిల్లలు పుట్టారని, తన పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడదని, తన పిల్లలనే కాదని ఏ పిల్లలను, మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+