అపశ్రుతి: ఫ్లెక్సీ కడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మృతి

ఒంగోలు: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అభిమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్లెక్సీ కడుతూ ప్రమాదవశాత్తు పవన్ కళ్యాణ్ అభిమాని మరణించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చినంగంజాంలో మంగళవారంనాడు చోటు చేసుకుంది.

ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి గోనినేని రమేష్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Pawan Kalyan fan dead in Prakasam district

పవన్ కళ్యాణ్ 43వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యారు.

పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ‘తొలిప్రేమ', ‘తమ్ముడు', ‘సుస్వాగతం', ‘బద్రి', ‘ఖుషి' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల రాజకీయాల్లో కూడా ఆయన సంచలనం సృష్టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+