పవన్ పర్యటన విజయవంతం చేయాలి
అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనను విజయవంతం చేయాలని పవన్ అభిమాన సంఘం నాయకులు కోరారు. ఈనెల 10 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. ఇదే వేదిక నుంచి ప్రత్యేక హోదా, అనంత కరవు, సాగు, తాగునీరు తదితర అంశాలపై పవన్ ప్రసంగిస్తారన్నారు. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున పార్టీలకతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమాన సంఘం నాయకులు టీసీ వరుణ్, గల్లా హర్ష, భవనీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications