Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాత్రికుల సేవలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్: ప్రయాణీకుల్ని కాపాడి, డ్రైవర్ మృతి

ఏలూరు: గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఉచిత బస్సు సర్వీసు నడుపుతున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అంతకుముందే బస్సును సురక్షితంగా నిలిపి, ప్రయాణీకులను కాపాడాడు.

జిల్లా కొవ్వూరులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొవ్వూరులో ఉచిత సర్వీసు నడుపుతున్న డ్రైవర్ హనుమంత రావుకు ఛాతి నొప్పి వచ్చింది. కొవ్వూరు ఈజీకే రోడ్డు నుంచి నందమూరు రోడ్డు వైపు వెళ్తుండగా ఛాతినొప్పి ఎక్కువైంది.

Pawan Kalyan fans helping to Pushkar devotees

తనకు ఛాతి నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ వాహనంను పక్కకు నిలిపి వేసి దిగిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా కార్యక్రమాలు

గోదావరి పుష్కరాల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు గోష్పాద వద్ద స్వచ్చంధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు మంచి నీరు అందిస్తున్నారు. తెలియని వారికి దారి చూపించడం, ట్రాఫిక్ చిక్కులు సరిదిద్దటం వంటివి చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+