పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెరైటీ క్యాలెండర్: ఆవిష్కరించిన టిడిపి నేత

కడప: యూత్‌ ఆఫ్‌ పవనిజం ఆధ్వర్యంలో 2016 పవన్‌కళ్యాణ్‌ క్యాలెండర్‌ను తెలుగుదేశం పార్టీ నాయకుడు దుర్గాప్రసాద్‌ ఆవిష్కరించారు. కడప నగరం అల్మాస్‌పేటలోని తన కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌ అభిమాన సంఘం 2016 క్యాలెండర్‌ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు.

హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ సమానమే అంటూ వచ్చే విధంగా ఈ క్యాలెండరును రూపొందించడం అభినందనీయమని ఆయన అన్నారు. గత సంవత్సరం లాగా 2016లో కూడా రక్తదాన శిబిరాలు ప్రకృతి వైపరీత్యాలకు సహాయం అందించిన విధంగా మంచి కార్యక్రమాలు చేసి పవన్‌కళ్యాణ్‌కి, ప్రజలకు దగ్గర కావాలన్నారు.

Pawan Kalyan fans vareity calender

ఈ కార్యక్రమంలో యూత్‌ ఆఫ్‌ పవనిజం అధ్యక్షుడు రంజిత్‌కుమార్‌, సభ్యులు సుధ, కృష్ణమూర్తి, నాగేంద్రబాబు, గౌస్‌ బాషా, మోహన్‌, చిన్నా తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+