Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: వదిన దగ్గర పర్సనల్ లోన్

Pawan Kalyan: పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు. నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Pawan Kalyan files nomination and Rs 46 70 Cr loans and dues mentioned in affidavit

కొద్దిసేపటి కిందటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ, నాగబాబు ఉన్నారు. అంతకుముందు భారీ ర్యాలీగా పవన్ కల్యాణ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు.

గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ హైవే వద్ద పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. గొల్లప్రోలు ఎమ్మార్వో కార్యాలయం, సూరీడు చెరువు, పిఠాపురం దూళ్ల సంత, చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ రోడ్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. అనంతరం ఎస్‌వీఎస్ఎన్ వర్మ, నాగబాబుతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 46,70,00,000 రూపాయల మేర అప్పులు ఉన్నట్లుగా చూపించారు. 15 మంది దగ్గర ఈ మొత్తాన్ని లోన్లు/డ్యూస్‌గా తీసుకున్నట్లు తెలియజేశారాయన. అవన్నీ కూడా పర్సనల్ లోన్లుగా పొందుపరిచారు.

Pawan Kalyan files nomination and Rs 46 70 Cr loans and dues mentioned in affidavit

ఈ 15 మందిలో పవన్ కల్యాణ్ వదిన, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పేరు సైతం ఉంది. 2,00,00,000 రూపాయల మేర పర్సనల్ లోన్ తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. కొందరు నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.

పవన్‌కు పర్సనల్ లోన్ ఇచ్చిన వారి జాబితాలో- విజయలక్ష్మి వీఆర్- రూ.8,00,00,000, హారిక అండ్ హాసిని క్రియేషన్స్- రూ.6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- రూ. 6,00,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్- రూ. 3,50,00,000, యెర్నేని నవీన్- రూ. 5,50,00,000 లోన్లు పవన్ పేరు మీద ఉన్నాయి.

ఎం ప్రవీణ్ కుమార్- రూ.3,00,00,000, మైత్రీ మూవీ మేకర్స్- రూ.3,00,00,000, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్- రూ.3,00,00,000, రాహుల్ కుందవరం- రూ.2,80,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ (హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ)- రూ.2,00,00,000, కొణిదెల సురేఖ- రూ.2,00,00,000, కోటింరెడ్డి సాహిత్యరెడ్డి- రూ. 50,00,000, లింగారెడ్డి లలిత- రూ. 50,00,000, ఏ దయాకర్- రూ.45,00,000, డీవీవీ ఎంటర్‌ప్రైజెస్- రూ.10,00,000ల మేర పర్సనల్ లోన్స్ తీసుకున్నారు పవన్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+