Pawan Kalyan: చంద్రబాబు టీంను "ఫిక్స్" చేసిన పవన్..!!
పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ తాను జీతం తీసుకోనంటూ ప్రకటన చేసారు. తాను పర్యవేక్షిస్తున్న పంచాయితీరాజ్ శాఖ అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన మంత్రుల్లో చర్చగా మారింది. పవన్ బాటలోనే ఇతర మంత్రులు అడుగులు వేస్తారా.. జనసేన మంత్రులు మాత్రమే ఫాలో అవుతారా. ఏం జరుగుతోంది.
పవన్ నిర్ణయంతో
ఉపముఖ్యమంత్రి పవన్ పని తీరు..నిర్ణయాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పవన్ కొద్ది రోజుల క్రితం ను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటాను అని...ఎందుకంటే ప్రజల సొమ్ము తింటున్నాను అనే బాధ్యత ప్రతి క్షణం గుర్తు ఉంటుంది కాబట్టి..అప్పుడు తాను పని చేయకపోతే ప్రజలు తనను ప్రశ్నించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మరో విధంగా స్పందించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ అప్పుల్లో ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరి కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

మంత్రుల్లో చర్చ
ఏపీలో ఉన్న అప్పుల గురించి గత కొన్నేళ్లుగా చంద్రబాబు, పవన్ ప్రతీ సందర్భంలో చెబుతూనే ఉన్నారు. గతంలో జగన్ సైతం ముఖ్యమంత్రిగా రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారని పలు సందర్బాల్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఏపీ అప్పుల గురించి పవన్ పదే పదే ప్రస్తావన చేసారు. ఇక..తాజాగా పవన్ పంచాయితీరాజ్ శాఖ ఆర్దిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తన శాఖ ఆర్దిక పరిస్థితి కారణంగా తాను జీతం, భత్యాలు, ఫర్నీచర్ కోసం ఖర్చు చేయటం సరికాదని..తాను వాటికి దూరంగా ఉంటానని స్పష్టం చేసారు.
ఫాలో అవ్వాల్సిందేనా
పవన్ తీసుకున్న నిర్ణయం పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ నిర్ణయం వ్యక్తిగతం ఆమోదమే అయినా..డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయం సహచర మంత్రివర్గం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అటు సీఎంగా చంద్రబాబు..లోకేష్ సహా మంత్రులంతా ఇప్పుడు జీతాలు తీసుకుంటూ...పవన్ మాత్రమే తీసుకోకపోవటం రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది. మరి...మొత్తం మంత్రివర్గం పవన్ బాటలోనే జీతం విషయంలో వ్యవహరిస్తుందా..లేక, తమ అధినేత మార్గంలో జనసేన ఇద్దరు మంత్రులు అడుగులు వేస్తారా..లేక ఈ నిర్ణయం పవన్ కే పరిమితం అవుతుందా అనేది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. దీంతో..ఇప్పుడు మంత్రులు ఒక విధంగా ఇరకాటంలో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications