సీనియర్లను రంగంలోకి దించిన పవన్, కీలక మలుపు..!!

జనసేనాని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో పవన్ తన వ్యూహాలు మార్చుతున్నారు. పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతూ వారికి టాస్క్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ నెల 26న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన కు కేటాయించిన శ్రీకాకుళం, కాకినాడ ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇటు నాలుగు జెడ్పీ పీఠాలు జనసేనకు కేటాయించారు. ఈ సమయంలో పవన్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయం గా కీలకంగా మారుతోంది.

ఏపీలో ఈ నెల 26న రెండో దశ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కూటమిలో పొత్తులో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్ పదవులు జనసేన పార్టీకి కేటాయించారు. తొలి విడత ఎన్నికల్లో విజయవాడ, ఏలూరు మేయర్ పీఠాలను జనసేన దక్కించుకుంది. ఇక, ఇప్పుడు ఈ రెండు స్థానాల్లోనూ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో.. ఈ రెండు చోట్ల గెలుపే లక్ష్యంగా పవన్ పార్టీ సమన్వయ కమిటీలను ప్రకటించారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంతో పాటుగా కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో ఈ కమిటీలు కృషి చేయాలని నిర్దేశించారు. కాకినాడ కోసం నియమించిన కమిటీ లో మంత్రులు కందుల దుర్గేష్, కొణతాల రామకృష్ణ తో పాటుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, బొమ్మిడి నాయకర్ ఉన్నారు.

జెడ్పీ ఛైర్మన్లుగా మజ్జిసిరి, పరిటాల శ్రీరామ్ - టీడీపి జాబితా ప్రకటన: బీజేపీ, జనసేనకు ఇలా..!!
జెడ్పీ ఛైర్మన్లుగా మజ్జిసిరి, పరిటాల శ్రీరామ్ - టీడీపి జాబితా ప్రకటన: బీజేపీ, జనసేనకు ఇలా..!!
pawan-kalyan-forms-special-committees-for-kakinada-and-srikakulam-corporation-elections-details-her

పవన్ తాజా నిర్ణయంతో

అదే విధంగా ఎమ్మెల్యేల్లో బత్తుల బలరామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, చిల్లపల్లి శ్రీనివాస్, సామి నేని ఉదయభాను, వేగుళ్ల లీలాకృష్ణ, ఘంటసాల వెంకటలక్ష్మి కు బాధ్యతలు కేటాయించారు. కాగా.. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, సుంద రపు విజయ్ కుమార్, లోకం మాధవి, నిమ్మక జయకృష్ణ తో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న టి. శివశంకర్, కొరికాన రవికుమార్, కొత్తగా ఏలూరు మేయర్ గా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడు, పాలవలస యశస్వి, పెనుగొండ సుబ్బారాయుడు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు కు బాధ్యతలను కేటాయించారు. ఈ నెల 24వ తేదీ వరకు వీరంతా తమకు కేటాయించిన కార్పోరేషన్లలో ఉంటూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+