Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును ఎలా అడగాలో తెలియటం లేదు - పవన్..!!

నామినేటెడ్ పదవుల పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మరిచిపోమని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల పైన కసరత్తు జరుగుతోంది. ఎన్నికల్లో సీట్లు దక్కని వారితో సహా... మూడు పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు నామినేటెడ్ పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. జనసేన నుంచి ఆశావాహులు ఉన్నారు. ఈ సమయంలో పవన్ తన వైఖరి స్పష్టం చేసారు.

పవన్ వ్యాఖ్యలతో
నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కీలక కామెంట్లు చేసారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని వ్యాఖ్యానించారు. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారని చెప్పిన పవన్.. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదని పవన్ స్పష్టం చేసారు.

Pawan Kalyan Gives clarity over Nominated posts for Janasena leaders deets here

ఆలోచన చేయండి
మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి గురించి కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. నాగబాబు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు పవన్ స్పందించారు. తన కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారని.. అది కరెక్ట్ కాదని వెల్లడించారు. ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదన్నారు. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేమని పవన్ పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించాలని కోరారు.

పదవుల కోసం కాదు
ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలనని చెప్పిన పవన్..కానీ తాను అడగలేదన్నారు. పదవుల కోసం మనం పని చేయడం లేదని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలన్నారు. నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+