ఢిల్లీకి పవన్ క్లారిటీ, ఎన్నికల్లో జరిగేదిదే - జగన్ కు కలిసొచ్చేనా..!!
ఏపీలో పొత్తుల రాజకీయంపై స్పష్టత వస్తోంది. టీడీపీ, జనసేన(TDP Janasena) పొత్తు ఇప్పటికే ఖాయమైనా బీజేపీ(BJP) నిర్ణయంపై స్పష్టత ఏంటనేది ఇప్పటి వరకు చర్చ. తాజాగా వారాహి యాత్రలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల్లో పోటీ..అధికారం పైన క్లారిటీ ఇచ్చేసారు. బీజేపీ తో కలిసి వెళ్తే ఓట్లు రావచ్చు..అసెంబ్లీకి ఎంతమంది వెళ్తామనే సందేహం వ్యక్తం చేసారు. రిస్క్ తీసుకోలేనని తేల్చేసారు. దీంతో, పొత్తుల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు సీఎం జగన్(CM Jagan) కు కలిసి వస్తాయా.
పవన్ వ్యాఖ్యలతో:ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంత కాలంగా ప్రచారం సాగింది. చంద్రబాబుChandra Babu) అరెస్ట్ తో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

జైలులో చంద్రబాబును కలిసిన పవన్ ఆవెంటనే టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించారు. ఆ సమయంలోనే బీజేపీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే బీజేపీ నేతలను కలిసి పొత్తు ప్రకటన వెనుక కారణాలను వివరిస్తానని చెప్పుకొచ్చారు. కానీ, పవన్(Pawan) కలిసే ప్రయత్నం చేసినా బీజేపీ నుంచి సానుకూలత రాలేదని సమాచారం. దీంతో, 20 రోజుల తరువాత పవన్ పరోక్షంగా తన వ్యూహం ఏంటనేది బయట పెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లినా ఓట్లు వస్తాయి ఏమో కానీ, సీట్లు రావనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
బీజేపీతో ఒక లేనట్లేనా:అవనిగడ్డ వారాహి యాత్రలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని..కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఎక్కడా బీజేపీ ప్రస్తావన చేయలేదు. గతంలో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం ఉందని పవన్ చెప్పేవారు.
ఇప్పుడు పొత్తు..అధికారం గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ ఊసే లేదు. దీని ద్వారా ఇక టీడీపీతో మాత్రమే కొనసాగాలని పవన్ డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని ఇప్పటికీ చెబుతున్నారు. పవన్ మాత్రం జనసేన - టీడీపీ పొత్తు గురించి వివరిస్తున్నారు. దీంతో, ట్రయాంగల్ పొలిటికల్ లవ్ స్టోరీ కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఎన్డీఏ సమావేశానికి పవన్ ను ఆహ్వానించి బీజేపీ మత మిత్రపక్షంగా జనసేనకు ప్రాధాన్యత ఇచ్చింది.

వైసీపీకి కలిసివచ్చేనా:ఇప్పుడు పవన్ ..వచ్చే ఎన్నికల్ల జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీతో కలిసేందుకు బీజేపీ సుముఖంగా లేకుంటే తాను టీడీపీతోనే వెళ్తానని ఢిల్లీ నేతలకు తాజా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. టీడీపీ, జనసేన పొత్తు గురించి వైసీపీ ముందు నుంచి స్పష్టతతో ఉంది.
బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేదే వైసీపీ ఇప్పటి వరకు వేచి చూసింది. ఇప్పుడు పవన్ స్వయంగా టీడీపీ, జనసేన ఏపీలో అధికారంలోకి వస్తామంటూ చేస్తున్న ప్రకటనల తో ఇక బీజేపీ వీరితో కలిసే అవకాశం లేదని వైసీపీ అంచనా వేస్తోంది. బీజేపీ ఓటింగ్ కంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎన్నికల సమయంలో కొన్ని అంశాల్లో వారి పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. అందులో బీజేపీ నుంచి జగన్ కు సహకారం అందకూడదనేది ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ ఆలోచన. కానీ, పవన్ తాజా వ్యాఖ్యలతో బీజేపీతో పొత్త దాదాపు లేనట్లే కనిపిస్తోంది. మరి..ఈ పరిణామాలు వైసీపీక ఏ మేర కలిసి వస్తాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications