చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం అందుకే: పవన్ కళ్యాణ్
కోనసీమ: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కులాలు దాటి మతాలు దాటి రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎదైనా మాట్లాడితే తన కులం నేతలతో తిట్టిస్తారని ఆరోపించారు.
జైలుకు.. బెయిలుకు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోందన్నారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరూ ఆపలేరన్నారు. సీఎం జగన్ కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు యత్నించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ది కోసం త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తోందని పవన్ తెలిపారు. వైసీపీ నుంచి ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇది రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారని ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పవన్.
అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.40 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, మనకు భద్రత కల్పించలేని ప్రభుత్వం కావాలా అనేది ఆలోచించాలని పవన్ కోరారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కౌలురైతులకు అండగా నిలబడ్డామన్నారు.
Glimpse of crowd at Amalapuram public meeting 🔥🔥🔥
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 11, 2024
#VarahiVijayaBheri pic.twitter.com/pev8KbMsXx
రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయని పవన్ దుయ్యబట్టారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు. కోనసీమ వాసులకు రైలుకూత వినిపించే వరకు కష్టపడతామని పవన్ పేర్కొన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగా కూటమి నేతలు పని చేస్తారని తెలిపారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్ హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిని ఎవ్వరినీ వదలబోమని పవన్ హెచ్చరించారు.
రాష్ట్రానికి పెద్దన్నలా చంద్రబాబు ముందుకు సాగుతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో యువత స్కిల్స్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత పది సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. తన ప్రయత్నాన్ని చూసిన తన అన్నయ(చిరంజీవి) జనసేన పార్టీ కోసం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారని గుర్తు చేశారు పవన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపబోమని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications