డౌట్: గంగులపై అఖిలప్రియ సంచలనం, ఆ వ్యాఖ్యల వెనుక మర్మం ఇదీ!
తెలుగుదేశం పార్టీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. గంగుల మద్దతుపై అనుమానం వ్యక్తం చేశారు.
నంద్యాల: తెలుగుదేశం పార్టీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. గంగుల మద్దతుపై అనుమానం వ్యక్తం చేశారు.
అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండటంపై స్పందించారు. ఆయన పరోక్షంగా తమకే మద్దతు పలుకుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఒకే ఒరలో భూమా, గంగుల
భూమా కుటుంబం, గంగుల కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గంగుల టిడిపిలో చేరుతారని వార్తలు వచ్చినప్పటి నుంచి ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా అనే చర్చ సాగింది. తాజాగా, ఇరువురు నేతలు టిడిపిలోనే ఉండటంతో నంద్యాల, ఆళ్లగడ్డలలో భూమా, గంగుల కుటుంబాల మధ్య పోరు రసకందాయానికి చేరుకుంది.

అలా టిడిపిలోకి వచ్చినా
2014 ఎన్నికల్లో భూమా కుటుంబం వైసిపిలో ఉంది. ఇటీవలే వారు టిడిపిలో చేరారు. భూమా కుటుంబం టిడిపిలో చేరడంతో గంగుల గంగుల వైసిపిలో చేరారు. గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ తనకు మాత్రం జగన్ అపాయింటుమెంట్ కూడా ఇవ్వడం లేదనే ఆవేదనతో గంగుల ప్రతాప్ రెడ్డి ఇటీవలే టిడిపిలో చేరారు.

అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
నంద్యాల ఉప ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో చేరారు. దీనిపై అఖిలప్రియను ఓ టీవీ ఛానల్ ప్రశ్నించగా.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా వర్గం బలంగా ఉందని, నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపుకు గంగుల ప్రతాప్ రెడ్డి కృషి చేస్తారని తాను అనుకోవడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఖిల వ్యాఖ్యలపై టిడిపిలోనే చర్చ
గంగుల ప్రతాప్ రెడ్డిపై మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా వీటిపై చర్చ సాగుతోందని చెబుతున్నారు. మొత్తానికి అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు టిడిపిలోను సంచలనానికి దారి తీసాయి.

అఖిలప్రియ వ్యాఖ్యల వెనుక..
అదే సమయంలో, మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యల వెనుక మర్మం దాగి ఉందని అంటున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో ఉండి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి వైసిపిలో ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుందని అఖిలప్రియ భావిస్తున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డిని అడ్డు పెట్టుకొని వైసిపిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డలో పెత్తనం చెలాయిస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందనేది అఖిల వాదనగా ఉంది.

పవన్ కళ్యాణ్‍పై నమ్మకం
మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉంటానని చెప్పినప్పటికీ, పరోక్షంగా ఆయన మద్దతు తమకేనని అఖిలప్రియ భావిస్తున్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications