జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. 'పవన్ ప్రాణదాత'

చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బోత్ ఆసుపత్రి అధినేత డాక్టర్ హరిప్రసాద్ పేదలకు చేయూతనిస్తున్నారు. హరిప్రసాద్ బోత్ ఆసుపత్రి అధినేత కావడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు కూడా.

గురువారం నాడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా నగరంలోని ఆటో డ్రైవర్లకు పవన్ ప్రాణదాత ఉచిత ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ స్ఫూర్తితో పేదలకు చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

 Pawan Kalyan

తన ప్రతి పుట్టిన రోజు నాడు ఓ సేవ కార్యక్రమాన్ని చేపడతానని, 2008లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గుడి, బడి, వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేశానని చెప్పారు. ఈ ఏడాది నగరంలోని దాదాపు పదిహేను వేలమంది ఆటో డ్రైవర్లకు ఆరోగ్య కార్డులు అందచేశానన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎముకలకు సంబంధించిన వైద్య చికిత్సలను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.

కాగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వల్లే హరిప్రసాద్ గత ఏడాది టిటిడి సభ్యుడిగా అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో హరిప్రసాద్ పని చేశారు. అప్పటి నుంచి ఆయనకు పవన్ కళ్యాణ్ పరిచయం ఈ నేపథ్యంలో టిటిడి సభ్యుడిగా అయ్యేందుకు పవన్ లాబీయింగ్ పని చేసిందనే వాదనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+