పవన్ తాజా వ్యాఖ్యల వెనుక - గురి పెట్టారా..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ వెళ్లిన పవన్ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను పరామర్శిస్తారని భావించారు. కానీ, ఆయన తిరిగి విజయవాడ కు రిటర్న్ అయ్యారు. సీఎం చంద్రబాబుతో కలిసి పొట్టి శ్రీరాములు వర్థంతి సభలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆం ధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగంను గుర్తు చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా పవన్ చేసిన వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది.
డిప్యూటీ సీఎం పవన్ విజయవాడలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు. పవన్ ప్రసంగిస్తుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా.. అరిస్తే బాగోదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. మహనీయుల వర్దంతి, జయంతిలు నిర్వహిం చటం ద్వారా భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయాలని పేర్కొన్నారు. మనుషు లకు మరుపు చాలా సహజమని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు తల్లితండ్రులనే మర్చి పోతున్నారని చురకలు అంటించారు. మనం కోసం ఎవరు నిలబడ్డారో వారిని మర్చిపోకూడదని పవన్ చేసిన వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది.

ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని.. దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరు వాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్య వైశ్య సమాజంలోనే దొరికేదని.. ఆయన ఒక కులానికి కాదని పేర్కొన్నారు. దేశం మొత్తం గర్వించే నాయ కుడని చెప్పుకొచ్చారు. తెలుగు వారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందని గుర్తు చేసారు.
మనం కోసం ఎవరు నిలబడ్డారో వారిని మర్చిపోకూడదని పవన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో భాగంగా చేసారా ..లేక, తాజా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసారా అనే చర్చ రాజకీయంగా మొదలైంది. అదే సమయంలో అరెస్ట్ అయి విడుదలైన అల్లు అర్జున్ ను పవన్ పరామర్శించకపోవటం కూడా సోషల్ మీడియాలో చర్చగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు.. విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications