పవన్ కళ్యాణ్ జోక్యం: సత్యానికి చొప్పదండి టిడిపి టికెట్
కరీంనగర్: జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ జోక్యంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారాయని అంటున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన మేడిపల్లి సత్యానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు కావడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ జోక్యం వల్ల పార్టీ కోసం పనిచేస్తున్న మ్యాక లక్ష్మణ్‌కు టికెట్ లభించకుండా పోయిందని వార్తలు వస్తున్నాయి. పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు తరఫున ఆయన పోటీకి దిగారు.

సుద్దాల దేవయ్య పార్టీ మారడంతో తనకు టికెట్ లభిస్తుందని మ్యాక లక్ష్మణ్ భావించారు కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్న మేడిపల్లి సత్యం గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. విలీనంతో ఆయన కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెసు టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, అక్కడ సుద్దాల దేవయ్య ఆటంకంగా మారారు.
పవన్ కళ్యాణ్ జోక్యంతో మేడిపల్లి సత్యానికి టిడిపి టికెట్ దక్కిందని అంటున్ారు. సత్యానికి టికెట్ ఖరారు చేసిన విషయం టిడిపి తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణకు కూడా తెలియదని అంటున్నారు.












Click it and Unblock the Notifications