నెరవేరిన కోరిక: పవన్ బ్రేక్, జనసేన కోసం నో చెప్తారా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన మరుసటి రోజు నుండి జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. ప్రస్తుతానికి పవన్ రాజకీయాలకు టాటా చెప్పారు. రెండు రోజుల క్రితం వరకు పవన్ రాజకీయాలతో బిజీబిజీగా గడిపారు.

టిడిపి, బిజెపి కూటమికి ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీలో, హైదరాబాదులో బిజెపి, టిడిపి కార్యక్రమాల్లో కనిపించారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావాలన్న తన కోరిక నెరవేరడంతో పవన్.. ప్రస్తుతానికి ఇక సినిమాల పైన పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు.

Pawan Kalyan is busy with shootings

ఆదివారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ సోమవారం గోపాలా గోపాలా చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని, అందుకోసం కోంతకాలం రాజకీయాలను పక్కన పెట్టాలని పవన్ భావిస్తున్నారట. ఆ తర్వాత తాను స్థాపించిన జనసేన పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారు. అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల పైన దృష్టి సారించనున్నారు.

వెంకయ్యకు పవన్ నో చెబుతారా?

పవన్ కళ్యాణ్‌ను రాజ్యసభకు పంపించేందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. త్వరలో మోడీ తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్‌ను రాజ్యసభకు పంపించేందుకు వెంకయ్య అటు, ఇటు ప్రయత్నిస్తున్నారట. అయితే తాను స్థాపించిన జనసేన పార్టీ నిర్ణాణంపై దృష్టి సారించనున్న పవన్.. బిజెపి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు తాను పదవుల కోసం పార్టీని స్థాపించలేదని చెప్పిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+