Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ కల్యాణ్ క్లారిటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలు వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్.. ఇటీవలే మూడో విడుత యాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విశాఖ జిల్లా గాజువాక నియోజకర్గంలో కొనసాగుతుంది. జనసేనానికి పార్టీ కార్యకర్తలు, గాజువాక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పవన్ సభకు ప్రజలు భారీగా హజరైయ్యారు.
ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో తాను గాజువాక నియోజకవర్గం నుంచే పోటీ చేశానని గుర్తు చేసుకున్నారు. జగన్‌ను నమ్మి మీరు నన్ను చట్టసభకు కూడా పంపలేదని పవన్ వాపోయారు. ఇప్పుడు గాజువాక ప్రజల మద్దతు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో గాజువాక సీటు కచ్చింతంగా జనసేనదే అని పవన్ కామెంట్ చేశారు. తాను కాకపోయినా తన పార్టీ నుంచి ఎవరో ఒకరిని నిలబెడతానని పవన్ ప్రకటించారు.

దీంతో రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత తిరిగి గాజువాక నుంచే పోటీ చేస్తారనే ప్రచారానికి తెరపడినట్లు అయింది. అయితే పవన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. గాజువాకలో వేరే అభ్యర్థి బరిలో ఉంటారని పవనే స్వయంగా చెప్పారు. తద్వారా ఆయన గాజువాక బరిలో తాను లేనని స్పష్టం చేసినట్టు అయింది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు.

ఆయన వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. పిఠపురం, కాకినాడ ఈ రెండు నియోజకవర్గాలను పవన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయడానికి పవన్ ఆసక్తి కనబరుస్తున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ ఓ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications