స్పీచ్‌లో పర్సనల్ విషయాలు: అన్నింటికి సిద్దపడ్డ పవన్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చే విమర్శలకు సరైన సమాధానాలు చెప్పందుకు సిద్ధంగా ఉన్నారట. అన్నింటికి సిద్ధపడే పవన్ రాజకీయాల్లోకి దిగుతున్నారని అంటున్నారు. సేవాభావం ఎక్కువగా ఉన్న పవన్ వ్యక్తిగత విషయాలపై ఆయా పార్టీల రాజకీయ నాయకులు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పనున్నారట.

ఏ రాజకీయ పార్టీ నుండి ఎలాంటి ప్రశ్న వచ్చినా జవాబు చెప్పనున్నారట. ఇప్పటికే కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఇటీవల పవన్ రాజకీయ ఆరంగేట్రంపై స్పందిస్తూ... వరుస పెళ్లిళ్ల మాట ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు లేదా వచ్చినా తాను మొదటే సమాధానం చెప్పానని తెలిపేందుకు పవన్.. శుక్రవారం నాటి ప్రసంగంలో వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడనున్నారట. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తన రెండు, మూడో పెళ్లిపై ఆయన వివరణ ఇచ్చే అవకాశముందంటున్నారు.

Pawan Kalyan is ready to face

పవన్ ఇటీవలె రష్యన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా నటి, మోడల్ అన్నా లెజ్‌వానెను వివాహం చేసుకున్నారు. దీనిపై విమర్శలు వస్తాయని ముందే ఊహించిన పవన్.. పెళ్లిళ్లపై వివరణ ఇవ్వనున్నారట. తన సోదరుడు చిరంజీవితో గల విభేదాల పైనా స్పందించనున్నారట.

రాజకీయం వేరు, కుటుంబం వేరు అని చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి భవిష్యత్తులో రాజకీయ నేతలు చేసే విమర్శలన్నింటికీ పవన్ దాదాపు శుక్రవారమే సమాధానం చెప్పనున్నారట. పార్టీ, విధివిధానాలు, ఏం చేస్తానో చెప్పటంతో పాటు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవకాశమున్నందునే 45 నిమిషాల పాటు ప్రసంగానికి కేటాయించారని, ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+