చిరంజీవి వ్యాఖ్య: చెప్పినట్టు చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 'అన్నయ్య' చిరంజీవి చెప్పిన మాటను వింటారా? అంటే.. అవుననే చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో చిరంజీవి 'తమ్ముడు' పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా రాజకీయాలను ప్రస్తావించారు.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు రెండు పడవల మీద ప్రయాణం చేయగలడని, ఇటు సినిమాలు, అటు రాజకీయాలలోను కొనసాగాలని సూచించారు. సినిమాలు మానివేయవద్దని హితవు పలికారు. అయితే, పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కోరికను సగం సగం నెరవేర్చేలా కనిపిస్తున్నారు.
తాను మరికొంత కాలం సినిమాలు చేస్తానని, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన సినిమాలను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. అయితే తనకు ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలిపెట్టే ఉద్దేశ్యం లేదని, ఒకవేళ నేను నటుడిగా కొనసాగలేకపోయినా.. రచయితగా, నిర్మాతగా సినిమాలు చేస్తానని చెప్పారు.

అయితే, అభిమానులు ఆయనను హీరోగానే ఎక్కువగా ఆరాదిస్తారు. అయితే, నిర్మాతగా, రచయితగా సినిమాల్లో కొనసాగుతానని చెప్పడం ద్వారా.. చిరంజీవి కోరికను సగం నెరవేరుస్తున్నట్లుగా భావించవచ్చు. అయితే, చిరంజీవి మాత్రం అతని సినిమాలలోనే హీరోగా కొనసాగాలని కోరుకున్నారు.
జనసేన పార్టీని స్థాపించినప్పుడు తన అన్నయ్యకు వద్దని చెప్పలేదని, అయితే తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తామిద్దరం వేర్వేరు దారుల్లో పయనిస్తున్నామని ఆయన తొలి నుంచి చెబుతున్నారు.
జనసేన పార్టీ విషయంలో అన్నయ్య వద్దని చెప్పలేదని, కానీ నీకు రాజకీయం ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఎంచక్కా సినిమాలు చేసుకో చాలని చెప్పారని, అది కూడా ఆయన స్వయంగా చెప్పలేదని, వేరే వాళ్లతో చెప్పించారని పవన్ కళ్యాణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications