పవన్ కల్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారా, త్రివిక్రమ్ కీ?

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా లేక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా రాజధానిలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్‌కు ప్రాంతాలకతీతంగా తెలంగాణ, సీమాంధ్రలో భారీగా అభిమానగణం ఉంది. ఇప్పటికే మల్కాజిగిరి నుండి చంద్రబాబు నాయుడు, షర్మిల, జయప్రకాశ్ నారాయణ తదితరుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ప్రజారాజ్యం, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ (ఎఎపి) పార్టీలలోని వైఫల్యాలపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారని అంటున్నారు. ఆ పార్టీలలోని నెగిటివ్ పాయింట్స్, ఫెయిల్యూర్స్‌కు కారణాలను తరిచి చూస్తున్నారట. పార్టీ పెడితే ఎఎపి లేదా లోక్‌సత్తాతో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్‌కు సినిమాలు చేయడం పట్ల అంత ఆసక్తి లేదట. కుటుంబ బాధ్యతలు తదితర అంశాల కారణంగానే ఆయన సినిమాలలో కొనసాగుతున్నారట.
త్రివిక్రమ్ కీ?
పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు స్నేహితులు. జల్సా సినిమా తర్వాత వీరిద్దరు కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. పవన్ తన భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై త్రివిక్రమ్‌తో చర్చిస్తారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కొత్త పార్టీ విషయం కూడా త్రివిక్రమ్ సూచనతోనే తెరపైకి వచ్చి ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications