పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్:బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే

పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్దం నిరాటంకంగా కొనసాగుతోంది. కొన్ని గంటల క్రితం టిడిపి మద్దతు ఛానెల్స్ కు, విభాగాధిపతులకు, షేర్ హోల్డర్లకు, పెట్టుబడిదారులకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు వెల్లడించిన పవన్ తాజాగా మరో ట్వీట్ చేశాడు.

ప్రముఖ పత్రిక, ఛానెల్ ఎండీని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇటీవల రాసిన ఒక కాలమ్ ను ఎద్దేవా చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లో చాలా సర్వసాధారణం అని బూతురత్నం అంటున్నాడంటూ...అందుకు ఒక సినిమాలో కమెడియన్ బొంబాయిలో అంతే అనే మేనరిజాన్ని వాడిన తీరును పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.

పవన్...లేటెస్ట్ ట్వీట్

పవన్...లేటెస్ట్ ట్వీట్

టిడిపి...ఆ పార్టీ మద్దతు ఇచ్చే టివి ఛానెళ్లపై యుద్ద ప్రకటించి ట్వీట్ల పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ మంగళవారం కూడా అదే పంథా కొనసాగించారు. మంగళవారం మధ్యాహ్నం టిడిపి సపోర్ట్ చేస్తున్న ఛానెళ్లకు సంబంధించి ముఖ్యులైన వారందరిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కొద్ది గంటల విరామంతో తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన నేరుగా పేర్లు,వివరాలు ప్రస్తావించకుండా పరోక్షంగా ఒక పత్రిక,మీడియా ఛానెల్ నడిపే ఎండిని లక్ష్యంగా చేసుకొని వ్యంగవ్యాఖ్యానాలతో ఈ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

Recommended Video

    పవన్ కళ్యాణ్ కు మనోజ్ మద్దతు.

    ఈ ట్వీట్ లో...ఏముందంటే

    'బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే'...అనే హెడ్ లైన్ తో విడుదల చేసిన ఈ పోస్ట్ లో కంటెంట్ విషయానికొస్తే...ఇటీవల ఆ పత్రిక యజమాని తాను రాసిన కాలమ్ లో పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన తిట్టు పల్లెటూళ్లలో సర్వసాధారణంగా వాడతారని, అది ప్రత్యేకించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదనే విధంగా రాసిన విషయాన్ని పరోక్షంగా ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్ లో వ్యంగాస్త్రాలు సంధించారు. ఒక సినిమాలో విలన్లు ఎలాంటి తప్పుడు పనులు చేసినా ఏంటిదని ఎవరైనా అడిగితే ఆ పక్కనున్న కమేడియన్ పాత్ర "బొంబాయిలో ఇంతే...బొంబాయిలో ఇంతే" అని అలాగే ఈ బూతురత్నం కూడా పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లలో చాలా సాధారణం అంటున్నాడు...ఈ లాజిక్ ను బట్టి ఇతనిని ప్రజలందరూ అలా పిలిచినా తప్పు అని ఏమీ అనుకోడని, కాబట్టి మీరు స్వేచ్చగా బూతురత్నని అలా పిలుచుకోవచ్చని ఎద్దేవా చేశారు...

    పళ్లెటూళ్లలో అంతే...పల్లెటూళ్లలో అంతే

    పళ్లెటూళ్లలో అంతే...పల్లెటూళ్లలో అంతే

    బూతురత్న లాజిక్ ప్రకారం మీరు స్వేచ్చగా అలా పిలుచుకుంటే అతడు బాధపడడని...నవ్వుకుంటూ "పల్లెటూళ్లలో అంతే...పల్లెటూళ్లలో అంతే"...అనుకుంటూ బూతుపలుకు రాస్తూ కూర్చుంటాడని పవన్ కల్యాణ్ వ్యంగాస్త్రం సంధించారు. అయితే అతను ఇచ్చిన లైసెన్స్ అతని వరకే పరిమితమవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి అని ముక్తాయింపు కూడా ఇచ్చారు పవన్ కల్యాణ్...

     కొనసాగుతోంది...ట్వీట్ల యుద్దం

    కొనసాగుతోంది...ట్వీట్ల యుద్దం

    ఇదీ పవన్ కల్యాణ్ తాజా ట్వీట్...దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ట్వీట్ల యుద్దానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థం అవుతోంది. దీంతో ఆయన ప్రత్యర్థులు ఎప్పుడు ఎవరిపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తాడో...అనేది ఆందోళన చెందుతుండగా...పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం తమ అభిమాన హీరో పెడుతున్న ట్వీట్లు తెగనచ్చేస్తున్నాయని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+