సీఎం పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు-మీరు అన్ని పార్టీలకు స్పూర్తి దాయకం :బీజేపీకి జలక్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావటానికి రాజకీయాలు చేయాలి కానీ...అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయం చేయకూడదని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, పవన్ ఆ ట్వీట్ లో ఎక్కడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు- ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించ లేదు. తెలుగుతో పాటుగా తమిళం లోనూ ట్వీట్ చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాలనా వ్యవహారాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు- అమలు చేస్తున్న పాలసీల పైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

వ్యక్తిగత పూజ వద్దంటూ వార్నింగ్..

వ్యక్తిగత పూజ వద్దంటూ వార్నింగ్..

అదే విధంగా జయలలిత- పళిని స్వామి ఫొటోలతో ఉన్న 65 లక్షల బ్యాగుల పంపిణీకి సంబంధించి ప్రజల సొమ్మును వేస్ట్ చేయవద్దని...వాళ్ల ఫొటోలు ఉన్నా వాటినే పంపిణి చేయాలనే నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. ఇక, తాజాగా తనతో పాటుగా తన కుమారుడిని ఎవరైనా పార్టీ నేతలు ప్రశంసిస్తే వారి పైన చర్యలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు. ఇటువంటి నిర్ణయాలతో ఇప్పుడు తమిళనాట రాజకీయాలు- అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన బేరీజు మొదలైంది .

స్టాలిన్ ను ప్రశంసిస్తూ పవన్ ట్వీట్..

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సైతం సీఎం స్టాలిన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. అందులో..అధికారంలోకి రావటానికి రాజకీయాలు చేయాలి కానీ...అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయం చేయకూడదని మాటల్లో కాకుండా..చేతల్లో చూపిస్తున్నారంటూ స్టాలిన్ ను పవన్ ప్రశంసించారు. మీ పాలన..మీ ప్రభుత్వ పని తీరు మీ రాష్ట్రానికే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు- అన్ని పార్టీలకు మార్గదర్శకం..స్పూర్తి దాయకమని ప్రశంసించారు. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. నా శుభాకాంక్షలు అంటూ పవన్ తన ట్వీట్ లో తమిళ నాడు ముఖ్యమంత్రిని కీర్తించారు.

జగన్-కేసీఆర్ ను ప్రస్తావించకుండానే..

జగన్-కేసీఆర్ ను ప్రస్తావించకుండానే..

అయితే, పవన్ ఎక్కడా తన తెలుగు రాజకీయాలను మాత్రం తమిళ రాజకీయాలతో నేరుగా పోల్చలేదు. అయితే, ఆగస్టు 15న పవన్ తన ప్రసంగంలో అధికారంలో ఉన్న వారు ఇప్పుడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తే..రేపు అధికారంలోకి వచ్చే వారు మరో సామాజిక వర్గం వారిని వేధిస్తారంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా.. ఏపీలో అధికార పార్టీ నిర్ణయాల పైన జనసేన నేతలు తరచూ విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ మిత్రపక్షంగా ఇరకాటమేనా..

బీజేపీ మిత్రపక్షంగా ఇరకాటమేనా..

ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ..డిఎంకే ముఖ్యమంత్రిని ప్రశంసించటం పైనా రాజకీయంగా హాట్ డిబేట్ మొదలైంది. డీఎంకే ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు మద్దతిస్తోంది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల పైన స్టాలిన్ తీవ్ర విమర్శలు చేసారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత నేరుగా స్టాలిన్ పైన ప్రశంసలు కురిపించటం పైన కమలం పార్టీ నేతల రియాక్షన్ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+