హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పచ్చని చెట్ల మధ్య పవన్ కళ్యాణ్: లుంగీలో గోవుల మధ్య గోపాలుడిలా!(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Launches Vana Rakshana Campaign || ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ || Oneindia Telugu

హైదరాబాద్: జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే పవన్ కళ్యాణ్ పచ్చని చెట్ల మధ్యలో సరదాగా గడిపారు.

మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేనమరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేన

భూమాతను పూజించి..

భూమాతను పూజించి..

హైదరాబాద్ శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వన రక్షణ కార్యక్రమానికి ముందు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ భూమాతను పూజించి పృథ్వీ సూక్తం పఠించి మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేయడం గమనార్హం.

కార్తీక మాస దీక్ష..

కార్తీక మాస దీక్ష..

పవన్ కళ్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ఈ నెల అంతా ఆయన ఘనాహారం స్వీకరించరు. ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. వివిధ సందర్భాలను అనుసరించి ఏడాదిలో ఏడు నెలలు ఈ విధంగా దీక్షలో ఉంటున్నారు. తను మొక్కలు నాటిన అనంతరం కార్యకర్తలతో దగ్గరుండి మొక్కలు నాటించారు.

పవిత్ర మాసంలో ఊరురా..

పవిత్ర మాసంలో ఊరురా..

పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాలలో ఒకటి. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమం ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వన సంరక్షణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్ర మాసంలో అందరినీ కలుపుకొని... పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలన్నారు.

పవన్ కళ్యాణ్ పిలుపు

పవన్ కళ్యాణ్ పిలుపు

ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని పవన్ కళ్యాన్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని పెంచి సంరక్షించడం కూడా మనందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

కుల భోజనాలు కాకూడదు..

మన సంస్కృతిలో మొక్కలు పెంచడం నుంచి వాటిని సంరక్షించుకోవడం భాగమేనని పవన్ వ్యాఖ్యానించారు. వేదాలు, పురాణాలు, కావ్యాల్లో మనం ప్రకృతిలో ఎలా మమేకం కావాలో చెప్పారన్నారు. కార్తీకంలో నిర్వహించే వనసమారాధనలు వర్గ, కుల భోజనాలు కాకూడదు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా అడుగులు వేసే కార్యక్రమానికి వేదిక కావాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

English summary
Janasena president Pawan Kalyan launches vana rakshana in his farmhouse in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X