ప్రభాస్, మహేశ్ బాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!
వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సినీ ప్రముఖల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు హీరోలందరిపైనా అభిమానం ఉందని చెప్పుకొచ్చారు. పలువురి హీరోల పేర్లు ప్రస్తావించారు. వారి సినిమాలు తాను చూస్తానని.. కనిపిస్తే మాట్లాడుకుంటామని చెప్పారు. సినిమాల పరంగా మీ హీరోల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించవద్దని పవన్ కోరారు.
పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు:పవన్ కల్యాణ్ ముమ్మిడివరం సభలో సినిమా హీరోలు..రాజకీయాల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. హీరోలు ప్రభాస్..మహేశ్ బాబు తనకంటే పెద్ద హీరోలని..ఎక్కువ పారితోషకం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. మీ అభిమానులు..ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడుతుంతారంటూ కొందరు తనతో చెబుతూ ఉంటారని ప్రస్తావించారు. సినిమా అనేది వినోదం...ఆనందం అని పవన్ వివరించారు.

తనకు జూనియర్ ఎన్టీఆర్ .. మహేశ్ బాబు..రామ్ చరణ్ ..అల్లు అర్జున్..చిరంజీవి..బాలయ్య..ఇలా ప్రతీ ఒక్కరి పైన గౌరవం ఉందని పవన్ పేర్కొన్నారు. వారి సినిమాలను తాను చూస్తానని చెప్పారు. కనపిస్తే మాట్లాడుకుంటామన్నారు. ప్రత్యేకించి ప్రభాస్..మహేశ్ బాబు గురించి పవన్ ప్రస్తావన చేసారు.
వారిద్దరూ పెద్ద హీరోలు:ప్రభాస్..మహేశ్ బాబు తన కంటే పెద్ద హీరోలని పవన్ వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా హీరోలైన వారు తన కంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటారని వెల్లడించారు. చరణ్, ఎన్టీఆర్ అయితే గ్లోబల్ స్థాయికి వెళ్లారని చెప్పుకొచ్చారు. వారు తెలిసినంతగా ప్రపంచవ్యాప్తంగా తాను తెలియదని వ్యాఖ్యానించారు.
ఆ విషయంలో తనకు ఎలాంటి ఇగో లేదని పవన్ పేర్కొన్నారు. సగటు మనిషి బాగేంటే చాలని తాను అనుకుంటానని చెప్పారు. కులపరంగా మనలో మనం గొడవ పడవద్దని పవన్ కల్యాణ్ హితవు చెప్పారు. సినిమాల విషయంలో ఎవరినైనా అభిమానించండి కానీ, రాజకీయం విషయంలో సమిష్టిగా ఆలోచన చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. పోరాటం చేసేవాళ్లు ఈ సమాజానికి కావాలని అభిప్రాయపడ్డారు.

దెబ్బ తిన్నా పారిపోను:తాను ఒక్కడినే సరిపోనని పవన్ చెప్పుకొచ్చారు. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు కావాలన్నారు. ఆడపడుచులు..యువత కావాలని పిలుపునిచ్చారు. తనకు ఎటాంటి భద్రత లేకపోయినా ఈ క్రిమనల్ గ్యాంగుతో గొడవ పెట్టుకుంటున్నానని కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు తన తల్లి వారాహి రక్ష అంటూ పవన్ చెప్పుకొచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పై మరోసారి పవన్ ఫైర్ అయ్యారు.
కోనసీమ రైతుల కన్నీటి మీద ద్వారంపూడి కుటుంబీకులు డబ్బు సంపాదిస్తున్నారని..వారి వెనుక సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. వారు ఏం దోచారో..ఎంత దాచారో చూపిస్తా అంటూ పవన్ హెచ్చరించారు. జనసేనకు అధికారం ఇవ్వాలని పవన్ కోరారు. తాను ఇంకోసారి దెబ్బ తిన్నా ఎక్కడికీ పారిపోనని..కానీ మళ్లి తప్పు చేస్తే మీరే నష్టపోతారని పవన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications