బెదిరింపులు, ఏం చేస్తానంటే.. తలదించుకు వెళ్తా: పవన్

హైదరాబాద్/గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి, బిజెపి కూటమికి మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సభలో మాట్లాడారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన పైన దాడి చేసి చూడండి ఏమవుతుందో అన్నారు.

తాము ప్రతిదాడులు చేయబోమని తేల్చి చెప్పారు. తమ పైన దాడికి పాల్పడితే జై భరతమాత అంటూ తలవంచి వెళ్లిపోతానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ చుట్టు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

అందుకే ఆయన తెలంగాణకు సహకరించారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే గోదావరి జిల్లాలో దోపిడీలు ఖాయమన్నారు. 2009లోనే తాను కాంగ్రెసు పార్టీ నాయకుల పంచెలు ఊడగొట్టి కొట్టమని పిలుపునిచ్చానని గుర్తు చేశారు. నాటి వైయస్ రాజశేఖర రెడ్డి అరాచకాలు చూడలేకే అలా పిలుపునిచ్చినట్లు చెప్పారు. తనకు తిక్కా ఉంది, లెక్కా ఉంది అన్నారు. వాటికి ఓ పద్ధతి అంటూ ఉంటుందన్నారు.

Pawan Kalyan make interesting comments

తొక్కిసలాట

నర్సాపురం పవన్ సభలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.

సాక్షిపై ఆర్ కృష్ణయ్య ఫైర్

రాష్ట్రంలో బీసీలందరూ టిడిపికే ఓటు వేసి మద్దతివ్వాలని తెలంగాణలో టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కోరారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని టిడిపియే పోరాడిందని, బిసిలను భుజానికెత్తుకుందన్నారు. బిసిలకు ఆరు నెలల్లోపు రాజ్యాధికారం వచ్చేలా టిడిపి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి పైన మండిపడ్డారు. తన గెలుపు కోసం చంద్రబాబు చాలా కృషి చేశారని చెప్పారు. దీనిపై సాక్షి కథనాలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. సాక్షి యాజమాన్యం బిసిలను అవమానిస్తోందన్నారు.

బాబు, మోడీ జోడితో అభివృద్ధి: వెంకయ్య

చంద్రబాబు, మోడీ జోడీతోనే దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, అందుకు వారి పాలనే ఉదాహరణ అని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు విజయవాడలో అన్నారు. కాంగ్రెస్ ఓట్లు, సీట్లు లెక్కలేసుకుని రాష్ట్రాన్ని విభజించిందన్నారు. మొదటి నుంచి విభజనకు అనుకూలమని బిజెపి ప్రకటించిందని, అయితే ఓ ప్రాంతానికి న్యాయం చేసి, మరోప్రాంతానికి అన్యాయం చేయమని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+