ఎన్టీఆర్‌లా: సర్దార్ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్?
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర పోషిస్తారని, రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతారని అంటున్నారు. ఎన్టీ రామారావు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత రాజకీయాలను ఒక ఊపు ఊపినట్లే పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా తర్వాత ఆ పని చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి 'సర్దార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా ఆయన గెడ్డం పెంచినట్లు భావిస్తున్నారు. ఇటీవలే చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షేవ్ చేసుకుని చాలా అందంగా కనిపించాడు.
ఈ తాజా చిత్రంలో పవన్ గడ్డంతో నటించే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాటిని షూటింగ్ చివరి షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని సమాచారం. సర్దార్ గెటప్పులో పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డంతో కనిపించడంపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది.

గతంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'సర్దార్ పాపారాయుడు'కు ఈ గెటప్పు దగ్గరగా ఉందని అంటున్నారు. అప్పుడు ఎన్టీఆర్ 'సర్దార్ పాపారాయుడు' చిత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అదే విధంగా సర్దార్ చిత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పనికి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications