ముఖ్యమంత్రిగా చిరంజీవి, అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్?

విజయవాడ/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోదరుడిని ముఖ్యమంత్రిగా చూసుకునేందుకు ముందుకు కదలనున్నారా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరును ముఖ్యమంత్రిగా చేసేందుకు పవన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

అయితే, ఈ విషయమై అధికారికంగా వెల్లడి కానప్పటికీ... ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమైనా జరగవచ్చునని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో టిడిపి, బిజెపి పార్టీల మధ్య బంధం రోజురోజుకూ బలహీనపడుతున్నట్లుగా కనిపిస్తోందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే బిజెపితో సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను పార్టీని మారబోవడం లేదని ఇటీవల చిరంజీవి చెప్పినప్పటికీ... ఆయన చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని బిజెపి నేతలు ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

Pawan Kalyan

మరోవైపు, అన్నయ్యను ముఖ్యమంత్రిగా చేసేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచార బాధ్యతలు తలకెత్తుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బిజెపితో ఉన్న తమ బంధం తెగుతుందా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని, తమ అధినేతనేత చంద్రబాబు, ప్రధాని మోడీల మధ్య గతంలో ఉన్నంత దగ్గరి సంబంధాలు ఇప్పుడు లేవని, ఇది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతుందోనని ఓ సీనియర్ టిడిపి నేత వ్యాఖ్యానించారట.

రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని, ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలూ వేయలేమని, పవన్ కళ్యాణ్ మాత్రం మంచి క్రౌడ్ పుల్లర్ అని, దానిని ఆయన ఓట్ల రూపంలోకి మలచగలరా అన్నది ఊహాగానమేనని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం 2018తో ముగుస్తుంది. ఇక ఆలోగానే ఆయన పార్టీ మారతారా? లేదా ఎన్నికలు జరిగే 2019 వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అన్నది ఇప్పటికీ ఉత్కంఠనే అంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినని చెప్పినప్పటికీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చుననే అంటున్నారు.

తాను నటనకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నన్ను నేను కాపాడుకునేందుకు సినిమాలు చేస్తున్నానని, మరో రెండు మూడు చిత్రాల తర్వాత విరమించుకుంటానని, రాజకీయాల్లో చేరి సేవ చేయడం నాపై ఉన్న అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+