సెర్చ్‌లో రాఖీ: రమ్య, చిరు కంటే పవన్ టాప్ (పిక్చర్స్)

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చింజన్‌లో అందరికంటే ముందు ఉన్నారట. సినిమాల్లో టాప్ హీరోగా నిలిచిన ఆయనను అభిమానులు ఫాలో అవుతూ.. పవనిజం అంటుంటారు.

ఇటీవల జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ఆరంగేట్రం చేశారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ ప్రతి అడుగు ట్విస్టుతో కూడుకున్నదిగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే దానిపై నిరంతరం సెర్చ్ ఇంజిన్ గూగుల్లో నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారట. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సెలబ్రిటీ అభ్యర్థుల్లో పవన కళ్యాణే ముందంజలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జరగనున్న 16వ లోకసభ ఎన్నికల్లో పలువురు నటీనటులు పోటీ చేస్తున్నారు. వారంతా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గూగుల్ పేర్కొంది. టాప్ టెన్‌లో ఉన్న వారిని పేర్కొంది.

చిరంజీవి

చిరంజీవి

పవన్ అన్నయ్య, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి, హిందీ కమెడియన్ శ్రీవాత్సవ, ఎఎపి తరఫున పోటీ చేస్తున్న గుల్ పనాగ్‌లు జాబితాలో ఉన్నారు.

రమ్య

రమ్య

ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ మాండ్య నియోజకవర్గం అభ్యర్థి, సిట్టింగ్ ఎంపి రమ్య కూడా ఈ సెర్చింగ్ జాబితాలో ఉన్నారు. ఎఎపి తరఫున పోటీ చేస్తున్న రచయిత కుమార్ విశ్వాస్ సెలెబ్రటీ క్యాండెడ్స్ టాప్ సెర్చ్‌‍లో చోటు దక్కించుకున్నారు.

నగ్మా

నగ్మా

తొలిసారి పోటీ చేస్తున్న నటి నగ్మా కూడా గూగుల్ సెర్చ్‌లో లిస్టులో ఉన్నారు. ఆమె కాంగ్రెసు పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమెకు ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నగ్మా బిజెపి అభ్యర్థి హేమమాలిని కంటే దాదాపు డబుల్ హిట్స్‌తో ఉన్నారట.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

మరోవైపు బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కూడా రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి నెటిజన్లను బాగానే ఆకర్షిస్తూ ఏడవ ర్యాంక్‌లో ఉందట.

జయప్రద

జయప్రద

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్, ఆర్ఎల్డీ తరఫున పోటీ చేస్తున్న జయప్రదలు, బెంగాలీ ఫిల్మ్ స్టార్ దేవ్‌లు కూడా జాబితాలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+