ప్రత్యేక హెలికాప్టర్లో మోడీ సభకి పవన్, ఫ్యాన్స్ ఆనందం
హైదరాబాద్/నిజామాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి బయలుదేరారు. హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ బయలుదేరారు.
మోడీతో పాటు పవన్ వేదికను పంచుకోనున్నందున అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు నాయకులు, అభిమానులు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు నిజామాబాదులో మోడీ సభ ఉంది. ఈ సభలో మోడీతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర పార్టీ నేతలు పాల్గొంటారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.

మోడీతో జెపి భేటీ
నరేంద్ర మోడీతో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో భేటీ కానున్నారు. మల్కాజిగిరి లోకసభకు పోటీ చేస్తున్న జెపి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం సభలో ఓ వేదికపై చంద్రబాబు, పవన్, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య నేతలు ఇరవై మంది హాజరు కానున్నారు. మరో వేదిక పైన బిజెపి, టిడిపి అభ్యర్థులు ఉండనున్నారు. 12 ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు స్టేడియం లోపల, తొమ్మిది సభాస్థలి బయట ఏర్పాటు చేయనున్నారు.
భద్రత: ప్రసాద రావు
మోడీ పర్యటన నేపథ్యంలో ఆయనకు భద్రతను ఏర్పాటు చేశామని డిజిపి ప్రసాద రావు చెప్పారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుస ఎన్నికలు పోలీసులకు సవాల్‌గా మారాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు చెప్పారు.
అందరం సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు నేతలు సహకరించాలని కోరారు. పోలింగుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తామన్నారు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం సహజమేనని చెప్పారు.
-
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు











Click it and Unblock the Notifications