త్వరలో జనసేన విద్యార్థి, మహిళా విభాగాలు: పవన్ కళ్యాణ్(వీడియో)
జనసేన పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన గురువారం ఫేస్‌బుక్ వీడియో ద్వారా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన వివరాలను తెలిపారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన గురువారం ఫేస్‌బుక్ వీడియో ద్వారా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన వివరాలను తెలిపారు.
జనసేన అనుబంధ సంఘాలకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట తాము సేవా దళాలు ఎందుకు ప్రారంభించామంటే.. చాలా మంది సేవ చేసేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు.
విద్యార్థి విభాగం, మహిళా విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని, వీటికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఏడాదిలోపే ఈ విభాగాలను ప్రారంభిస్తామని పవన్ తెలిపారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని, అక్టోబర్ నుంచి పూర్తిగా క్రియాశీలకంగా ఉంటామని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications