తగ్గను: మెగా ఫైర్‌పై పవన్ కళ్యాణ్!? సామాజిక విప్లవం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ నేపథ్యంలో మెగా సోదరుల మధ్య విభేదాలు రాజుకున్న విషయం తెలిసిందే. తాను, మెగా అభిమానులు తన అన్న చిరంజీవి వెంటే ఉంటారని నాగబాబు గురువారం ప్రకటించారు. దీనిని పలువురు సన్నిహితులు పవన్ దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు ఆయన స్పందించారట. ఆలోచన చేశాక వెనక్కి తగ్గేది లేదని సన్నిహితులతో అభిప్రాయపడ్డారట.
సామాజిక విప్లవం
జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వస్తున్న పవన్ కళ్యాన్ సామాజిక విప్లవం పేరుతో ముందుకు రానున్నారట. నేటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి 2008లో సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. నాటి సామాజిక న్యాయానికి దగ్గరగా... నేటి పవన్ కళ్యాణ్ సామాజిక విప్లవం ఉండటం గమనార్హం.

కాగా, పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు పార్టీ, విధివిధానాలు తదితర అంశాలను ప్రకటించిన తర్వాత నాలుగైదు రోజులు హైదరాబాదులోనే ఉండనున్నారు. పార్టీ కార్యకలాపాలు చూసుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఆయన అదిలాబాద్ లేదా అనంతపురం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
పవన్ అభిమానుల సంఘం
పవన్ కళ్యాణ్ సమావేశానికి వెళ్లవద్దని అభిమానులకు చిరు నుండి మెసేజ్ వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎక్కువమంది పవన్‌తో వెళ్లేందుకే సిద్ధమవుతున్నారు. అవసరమైతే తాము పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications