ఐడియా: ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ జన సేన

హైదరాబాద్: పాలించే స్థాయి కోసం కాదు... ప్రశ్నించే హక్కు కోసం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జన సేన పార్టీని ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్ ముక్కు సూటిదనం వల్ల, కచ్చితత్వం వల్ల పార్టీ కూడా ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. నచ్చిన విషయాన్ని ఎదుటివారితో ఎంత సరదాగా పంచుకుంటారో, తనకు నచ్చని విషయాన్ని అంతే ఘాటుగా, సూటిగా వ్యక్తం చేస్తారనే అభిప్రాయం ఉంది.

పవన్ కళ్యాణ్ పార్టీకి యువశక్తి ప్రధాన చోదకశక్తిగా ఉంటుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారనే వార్త వచ్చినప్పటి నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో ఆయన పేరు మారుమోగుతోంది.

Pawan Kalyan party is to question

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఆసక్తిగల తెలుగువారంతా ఈ నెల 14వ తేదీన హైటెక్స్‌లో నిర్వహించే పవన్ రాజకీయ సభను చూసేందుకు ప్రత్యేకించి స్వచ్ఛందంగా స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాదుకు పెద్ద యెత్తున పవన్ కళ్యాణ్ అబిమానులు తరలి రానున్నారు.

రాజకీయ సభలో పవన్ కళ్యాణ్ దాదాపు 14 నిమిషాలు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతారు, ఎవరిని గురించి మాట్లాడుతారు, పవన్ పార్టీ జెండా, అజెండా ఏమిటి అనే విషయాలపై ఉత్కంట నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+