Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ పార్టీ పేరు జనసేన: 14 ప్రకటన

హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పేరు జన సేన అని తెలుస్తోంది. ఈ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పవన్ కల్యాణ్ సోమవారం దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి తన పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నారు. ఈ నెల 14న పవన్ మీడియా సమావేశంలో తన పార్టీ పేరును ప్రకటిస్తారు.

పవన్ కల్యాణ్ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పిఆర్పీ), యువరాజ్యం తదితర పేర్లు మొదట వినిపించాయి. అయితే సోమవారం ఎన్నికల సంఘం వద్ద జన సేన పేరుతో పేరును నమోదు చేశారట. ఈ పేరుతోనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ బరిలోకి దిగనుంది. అయితే పవన్ పార్టీ అన్నిస్థానాలలో పోటీ చేసే అవకాశాలు లేవంటున్నారు.

వీడియో కోసం ఫోటోపై క్లిక్ చేయండి

పార్టీని కేవలం ప్రశ్నించేందుకే పెడుతున్నట్లు పవన్ చెబుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపనున్నారు. పవన్ కల్యాణ్ మల్కాజిగిరి లేదా కాకినాడల నుండి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కాగా, పవన్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పలు పార్టీలు ఆయనను ఆహ్వానించాయి. లోక్ సత్తా, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు పవన్‌ను తమ తమ పార్టీలలోకి ఆహ్వానించాయి. ఆయన మాత్రం కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారు.

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTM0NTU2fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+